మరో రికార్డుకు చేరువలో ధోని.. | MS Dhoni all set to create another record at Newlands | Sakshi

మరో రికార్డుకు చేరువలో ధోని..

Feb 24 2018 4:10 PM | Updated on Feb 24 2018 4:12 PM

MS Dhoni all set to create another record at Newlands - Sakshi

కేప్‌టౌన్‌:ఇప్పటికే పలు మైలురాళ్లను అందుకున్న భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో 49 క్యాచ్‌లు పట్టిన ధోని మరో క్యాచ్‌ పడితే 'హాఫ్‌ సెంచరీ' మార్కును చేరతాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌గా ధోని ఘనత సాధిస్తాడు. ఇప్పటికే ధోని తొలి స్థానంలో ఉండగా, 32 క్యాచ్‌లు అందుకుని వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ రామ్‌దిన్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో 30 క్యాచ్‌లతో దక్షిణాఫ్రికా కీపర్‌ డికాక్‌ కొనసాగుతున్నాడు.

ఓవరాల్‌గా 78 అంతర్జాతీయ టీ20 అవుట్‌లలో భాగస్వామ్యమైన ధోని.. 49 క్యాచ్‌లు, 29 స్టంపింగ్‌లు చేశాడు. దాంతో అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక మందిని అవుట్ కావడంలో ధోని భాగస్వామ్యమయ్యాడు. ఇదిలా ఉంచితే, టీమిండియా కెప్టెన్‌ మరో 17 పరుగులు చేస్తే టి20ల్లో కోహ్లి 2 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement