చెన్నై: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కనీసం డ్రా కోసం యత్నించాల్సి ఉండాల్సింది అనే వాదనను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొట్టిపారేశాడు. టీమిండియా సిరీస్ కోల్పోయిన తరుణంలో కేవలం నెగిటివ్ విషయాల్ని మాత్రమే ప్రస్తావించకుండా, మన జట్టులో పాజిటివ్ కోణాన్ని కూడా చూడాలని విజ్ఞప్తి చేశాడు. ఒక టెస్టు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లూ సాధించాలని, అది మన బౌలర్లు చేసి చూపించారన్నాడు. ఇది మనకు చాలా సానుకూల అంశంగా అభిమానులు గుర్తించాలన్నాడు
'నేను ఇక‍్కడ ఒక్క విషయం మాత్రమే చెప్పదలుచుకున్నా. సఫారీ పర్యటనలో భారత జట్టు సానుకూలంగా ముందుగా సాగుతుంది.ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయాలి. అది మనం చేసి చూపించాం. ఒకవేళ 20 వికెట్లు తీయలేని పక్షంలో తదుపరి పరిణామం ఏమిటి అని ఆలోచించాలి. అప్పుడే డ్రా కోసం యత్నించాలి. అంతేకానీ 20 వికెట్లు సాధించిన క‍్రమంలో డ్రా కోసం ఎందుకు ఆడాలి. స్కోరు బోర్డుపై తక్కువ పరుగులున్నా, భారీగా పరుగులున్నా మొత్తం వికెట్లు తీయలేనప్పుడే డ్రా కోసం ఆడాల్సి వుంటుంది. 20 వికెట్లు తీయలేనప్పుడు స్వదేశంలోనైనా, విదేశంలోనైనా టెస్టు మ్యాచ్ గెలవలేం. మరి మనోళ్లు 20 వికెట్లు సాధించినప్పుడు గెలుపుకు అన్ని విధాల అర్హత ఉందని అర్ధం. ఆ క్రమంలో ఓటమి ఎదురైతే విమర్శలతో దాడి చేయడం సరికాదు' అని సఫారీ పర్యటనలో టెస్టు సిరీస్ కోల్పోయిన విరాట్ గ్యాంగ్‌కు మద్దుతుగా మాట్లాడాడు.
Comments
Please login to add a commentAdd a comment