PC: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తుంది. గుజరాత్ అభిమానులు ఈ వెటరన్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. త్వరలో భారత ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టులో చోటు కన్ఫర్మ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐసీసీ ట్రోఫీ (డబ్ల్యూటీసీ) సాధించాలంటే టీమిండియాకు సాహా సేవలు చాలా అవసరమని అంటున్నారు.
వయసు (38) సాకుగా చూపి సాహాను విస్మరించొద్దని అంటున్నారు. ఎలాగూ కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది కాబట్టి, అతని స్థానంలో సాహాను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన రెగ్యులర్ వికెట్‌కీపర్ కేఎస్ భరత్‌తో పోలిస్తే సాహా చాలా బెటరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాహా అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిస్తే టీమిండియాకు మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
ఫార్మాట్‌కు తగ్గట్లుగా సాహా తన ఆటతీరును మార్చుకుంటాడని, అతనిలో టాలెంట్‌ను భారత సెలెక్టర్లు ఇకనైనా గుర్తించాలని అంటున్నారు. ఐపీఎల్‌లో అతను చేసిన సెంచరీని, దేశవాలీ క్రికెట్‌లో చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని (20 బంతుల్లో 4 ఫోర్లు, 14 సిక్సర్ల సాయంతో 102) గుర్తించుకోవాలని కోరుతున్నారు. రహానే లాగే సాహా ఇన్నింగ్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఎంపిక చేయాలని కోరుతున్నారు.
కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సాహాతో పాటు శుభ్‌మన్ గిల్ (51 బంతుల్లో 94 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగడంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది. డి కాక్ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్ మేయర్స్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు.
అయితే 9వ ఓవర్‌లో మేయర్స్ ఔట్ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. డికాక్ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది.
చదవండి: IPL 2023: గిల్, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్ ఘన విజయం
Comments
Please login to add a commentAdd a comment