శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(56) అర్ధసెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో అర్ధసెంచరీ. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనూ సాహా అర్ధసెంచరీ(60) చేశాడు.
లోకేశ్ రాహుల్(108) సెంచరీ చేశాడు. కోహ్లి(78), రోహిత్ శర్మ(79) అర్థసెంచరీలు చేశారు. అమిత్ మిశ్రా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్, మాథ్యూస్, చమీర రెండేసి వికెట్లు తీశారు.