colombo test match
-
లంచ్ విరామానికి శ్రీలంక 134/5
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో విజయాన్ని భారత్ 5 వికెట్ల దూరంలో నిలిచింది. మరో 5 వికెట్లు తీస్తే విజయం కోహ్లి సేన సొంతమవుతుంది. చివరి రోజు భోజన విరామానికి శ్రీలంక 5 వికెట్లు నష్టపోయి 134 పరుగులు చేసింది. లంక విజయం సాధించాలంటే ఇంకా 252 పరుగులు చేయాల్సివుంటుంది. కెప్టెన్ మాథ్యూస్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మాథ్యూస్ 59, పెరీరా 12 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే సిరీస్ 1-1తో సమం అవుతుంది. -
22 ఏళ్ల నిరీక్షణకు 7 వికెట్ల దూరంలో..
-
22 ఏళ్ల నిరీక్షణకు 7 వికెట్ల దూరంలో..
భారత్ 22 ఏళ్ల కల సాకారమయ్యేందుకు 7 వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్‌ను రెండు దశాబ్దాల తర్వాత గెలుచుకునే అవకాశం వచ్చింది. లంకతో కీలక మూడో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం 386 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లంక 3 వికెట్ల నష్టపోయి 67 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి 7 వికెట్లు అవసరం కాగా, లంకకు 319 పరుగులు కావాలి. ఈ మ్యాచ్‌లో భారత్‌కే ఎక్కువ విజయావకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో లంక, భారత్ 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. లంకలో టీమిండియా చివరి సారిగా 1993లో టెస్టు సిరీస్ నెగ్గింది. లంక లక్ష్యసాధనలో ఆరంభంలోనే టీమిండియా పేసర్లు ఆతిధ్య జట్టుకు షాకిచ్చారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆరో బంతికి ఓపెనర్ ఉపుల్ తరంగ.. పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నమాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణరత్నే సైతం డకౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక జట్టు రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన చండీమల్ వికెట్ ను ఇషాంత్ కూల్చాడు. శర్మ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన చండీమల్ పెవిలియన్‌కు చేరాడు. ఆట ముగిసే సమయానికి సిల్వా(24), కెప్టెన్ మాథ్యూస్(22) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 21/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 274 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (50), అశ్విన్ (58) హాఫ్ సెంచరీలు చేయగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బిన్నీ 49, ఓజా 35, అమిత్ మిశ్రా 39 పరుగులతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌ల్లో భారత్ 312 పరుగులు చేయగా, లంక 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
టీమిండియాదే పైచేయి కానీ..
శ్రీలంకతో మూడో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి 21/3 స్కోరు చేసింది. అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్ లో లంకను 201 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా ఓవరాల్‌గా ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డ్ అవ్వగా, మరో ఓపెనర్ రాహుల్ రెండు పరుగులు చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రహానే(4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కెప్టెన్ కొహ్లీ, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగటంతో శ్రీలంక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్లు ఉపుల్ తరంగ, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరగటంతో ఓ దశలో 127 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన లంక ఇబ్బంది పడింది. అయితే పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించారు. టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది. -
రెండు రన్స్ కే ఓపెనర్లు ఔట్
కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కీలక ఆధిక్యం సాధించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్ కే వెనుదిరిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. శ్రీలంక పేసర్లు ప్రదీప్, ప్రసాద్‌లు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో రెండు పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. అంతకు ముందు శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మకు ఐదు వికెట్లు లభించాయి. -
లంకతో మూడో టెస్టు: భారత్ కు ఆధిక్యం
ఐదు వికెట్లు కూల్చిన ఇషాంత్ శర్మ కొలంబో: కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక తొలి ఇన్నింగ్స్ లో 201 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇషాంత్ ఐదు వికెట్లు కూల్చగా.., బిన్న, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు, ఉమేష్ వికెట్ తీశారు. దీంతో టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసింది. -
చెలరేగిన భారత పేసర్లు.. లంక విలవిల
కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక టాపార్డర్ కుప్పకూలింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం టీ విరామ సమయానికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. హెరాత్ 47 పరుగులు, ప్రసాద్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇషాంత్ నాలుగు, బిన్నీ రెండు, ఉమేష్, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు. లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్ రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసింది. -
కష్టాల్లో లంకేయులు
కొలంబో: భారత్ తో మూడో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక కష్టాల్లో పడింది. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించాలంటే ఇంకా 265 పరుగులు చేయాల్సివుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టీమిండియా పేసర్లు లంక బ్యాట్స్ మన్ కు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయుల భరతం పట్టారు. పదునైన బౌలింగ్ తో లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు పడగొట్టారు. తరంగ(4), సిల్వా(3), కరుణరత్నె(11), చందిమాల్(23), మాథ్యూస్(1) అవుటయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 2, స్టువర్ట్ బిన్నీ 2 వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 312 పరుగులకు ఆలౌటైంది. -
లంచ్ విరామానికి భారత్ 179/3
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది. మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82, రోహత్ శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో కుశాల్ 2 వికెట్లు పడగొట్లాడు. ప్రసాద్ కు ఒక వికెట్ దక్కింది. -
సాహా అర్ధసెంచరీ; భారత్ 393 ఆలౌట్
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(56) అర్ధసెంచరీ సాధించాడు. 106 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికిది రెండో అర్ధసెంచరీ. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లోనూ సాహా అర్ధసెంచరీ(60) చేశాడు. లోకేశ్ రాహుల్(108) సెంచరీ చేశాడు. కోహ్లి(78), రోహిత్ శర్మ(79) అర్థసెంచరీలు చేశారు. అమిత్ మిశ్రా 24 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్, మాథ్యూస్, చమీర రెండేసి వికెట్లు తీశారు.