కొలంబో టెస్ట్ లో 201 పరుగులకు ఆలౌట్ అయిన శ్రీలంక, ఐదు వికెట్లు కూల్చిన ఇషాంత్ శర్మ
ఐదు వికెట్లు కూల్చిన ఇషాంత్ శర్మ
కొలంబో: కీలక టెస్టులో టీమిండియా జూలు విదిల్చింది. బ్యాటింగ్ లో చటేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కగా.. బౌలింగ్ లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇషాంత్, ఉమేశ్, స్టువర్ట్ బిన్నీల పేస్ దెబ్బకు లంక తొలి ఇన్నింగ్స్ లో 201 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇషాంత్ ఐదు వికెట్లు కూల్చగా.., బిన్న, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు, ఉమేష్ వికెట్ తీశారు. దీంతో టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది.
మ్యాచ్ మూడో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక ఓపెనర్లు ఉపుల్ తరంగా, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించడంతో లంక ఈ మాత్రం స్కోరయినా చేయగలిగింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది.