'ధోని స్థానాన్ని భర్తీ చేయడం కష్టం' | Not easy to fill void created due to Dhoni retirement, says Saha | Sakshi
Sakshi News home page

'ధోని స్థానాన్ని భర్తీ చేయడం కష్టం'

Published Fri, Jul 1 2016 6:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Not easy to fill void created due to Dhoni retirement, says Saha

బెంగళూరు:టెస్టు క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని లేని  లోటును తాను భర్తీ చేయడం అంత సులభం కాదని యువ వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా తెలిపాడు. మ్యాచ్ విన్నర్గా పేరున్న ధోని స్థానాన్ని పూడ్చటమంటే తనకు అంత సులువు కాదన్నాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో  వృద్ధిమాన్ సాహా స్పెషలిస్టు వికెట్ కీపర్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన వృద్దిమాన్.. భారత జట్టులో వికెట్ కీపర్ గా ధోని ఏ విధంగా రాణించాడో, అదే తరహాలో ఆకట్టుకోవడానికి యత్నిస్తానన్నాడు.

 

'టీమిండియాకు ఎన్నో ఘన విజయాలను అందించిన ధోని తరహాలో రాణించడమంటే అంత సులభం కాదు. ప్రపంచ క్రికెట్ లో ధోనిది ప్రత్యేక స్థానం. ధోని మాదిరిగా రాణించడానికి యత్నిస్తున్నాను.  వికెట్ల వెనకాల ధోని పోషించిన పాత్ర అమోఘం. అటు క్యాచ్లు పట్టడంలో కానీ, క్లిష్ట సమయంలో స్టంపింగ్ చేయడంలో ధోని అందివేసిన చేయి. అతని లేని లోటును నేను పూర్తి చేయడం సులభ సాధ్యం కాదు' అని వృద్ధిమాన్ తెలిపాడు.


తనకు వీలుదొరికినప్పుడల్లా ధోనితో మాట్లాడుతూ తగిన సలహాలు తీసుకుంటూ ఉంటానన్నాడు. ప్రత్యేకంగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో,  ఐపీఎల్ల్లో ధోని నుంచి అనేక టిప్స్ తెలుసుకున్నట్లు వృద్ధిమాన్ స్పష్టం చేశాడు. తన శైలిలో రాణించి జట్టు విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement