Photo Credit : IPL Website
ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్, భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న సాహా.. 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 81 పరుగులు చేశాడు.
సాహా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 20 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా బట్లర్, దుబే, శార్ధూల్ ఠాకూర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఈ ముగ్గురు కూడా 20 బంతుల్లో అర్ధశతకం సాధించారు.
సాహాకు ఛాన్స్ ప్లీజ్
ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఇంకా అతడి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఈ క్రమంలో గిల్ స్థానంలో సాహాను భర్తీ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
టెస్టులు ఆడిన అనుభవం ఉన్న సాహాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా వృద్ధిమాన్ సాహా ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ కోల్పోయిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2023: హ్యారీ బ్రూక్‌ను పక్కన పెట్టండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి! అయినా కష్టమే
Comments
Please login to add a commentAdd a comment