India Vs Nz 1st Test Day 2 2021 Highlights:
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(75*), టామ్ లాథమ్(50*) అర్థసెంచరీలు సాధించారు. కాగా న్యూజిలాండ్ ఇంకా 215 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌటైంది.
న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ అద్భుతంగా ఆడుతున్నారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో 57 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 129 పరుగులు చేసింది.
Updates:
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టీమిండియా 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 111.1 ఓవర్ల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 258/4 స్కోరుతో రెండో రోజు ఆటను మొదలెట్టిన రహానే సేనను కివీస్ బౌలర్ టిమ్ సౌథీ దెబ్బతీశాడు. అర్ధ సెంచరీ సాధించిన జడేజా.. ఆ తర్వాత సాహా, సెంచరీ హీరో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మరో బౌలర్ అజాజ్ పటేల్ అశ్విన్, ఇషాంత్ శర్మలను పెవిలియన్‌కు పంపి లాంఛనం పూర్తి చేశాడు. ఇక కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌లు జట్టుకు శుభారంభం అందించారు. యంగ్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. లాథమ్ కూడా హాఫ్ సెంచరీ దిశ(40)గా పయనిస్తున్నాడు. 46 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 116/0.
3: 40 PM:
న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. బౌండరీలు బాదుతూ కివీస్ స్కోరును పెంచుతున్నాడు. మరో ఓపెనర్ టామ్ లాథమ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతున్నాడు. ఇద్దరూ నిలకడగా ఆడుతుండటంతో 44 ఓవర్లు ముగిసే సరికి కివీస్ 110 పరుగులు చేసింది.
2:55 PM: న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ నిలకడగా ఆడుతున్నారు. 28వ ఓవర్‌లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన విల్ యంగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 33 ఓవర్లు ముగిసే సరికి లాథమ్ 28, యంగ్ 58 పరుగులతో ఉన్నారు.
స్కోరు: 89-0
1:38 PM:
►15 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ స్కోరు: 35-0.
12:35 PM:
►ఇషాంత్ శర్మ టీమిండియా బౌలింగ్ అటాక్‌ను ఆరంభించాడు. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్(0), విల్ యంగ్(2) క్రీజులో ఉన్నారు.
►మొదటి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అజాజ్ పటేల్ బౌలింగ్‌లో అశ్విన్ బౌల్డ్ అయ్యాడు.
109 ఓవర్లలో స్కోరు ఎంతంటే
►కివీస్ బౌలర్ టిమ్ సౌథీ వరుస వికెట్లు పడగొడుతున్నాడు. తొలుత జడేజా.. ఆ తర్వాత సాహా, శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్‌కు పంపిన సౌథీ... అక్షర్ పటేల్‌ను కూడా అవుట్ చేశాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం అశ్విన్, ఉమేశ్ యాదవ్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 339/8 (109)
12:05 PM:
లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 339 పరుగులు చేసింది. అశ్విన్ 38 పరుగులు, ఉమేశ్ యాదవ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
►స్కోరు: 339/8 (109)
11:29 AM:
108 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 333-8
11:11 AM:
104 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
11:00 AM:
100 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 314-8.
10: 57 AM:
99వ ఓవర్ చివరి బంతికి అక్షర్ పటేల్(3) అవుట్.
అయ్యర్ సైతం
టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా... టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 171 బంతుల్లో 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ప్రస్తుతం అశ్విన్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.
10: 38 AM:
అయ్యర్ రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు సాహాను అవుట్ చేసిన కివీస్ బౌలర్ టిమ్ సౌథీ.. నిలకడగా ఆడుతున్న అయ్యర్‌ను సైతం పెవిలియన్‌కు పంపి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
మరో వికెట్ డౌన్
సౌథీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ‍్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్(104), అశ్విన్(13) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు రవీంద్ర జడేజా( 50 పరుగులు) పెవిలియన్ చేరాడు. టిమ్ సౌథీ అతడిని అవుట్ చేశాడు.
10: 30 AM:
95 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 301-6.
అయ్యర్ అద్భుతం
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భాగంగా మొదటి రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచిన టీమిండియా రెండో రోజు ఆట మొదలెట్టింది. అరంగేట్ర హీరో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. 92వ ఓవర్‌లో జెమీషన్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి.. టెస్టుల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇక జడేజా టిమ్ సౌథీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో భారత్ రెండో రోజు తొలి వికెట్ కోల్పోయింది.
కాగా కాన్పూర్ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
ఇక్కడ చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్‌లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ
భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్) శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే.
Comments
Please login to add a commentAdd a comment