
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.
అందుకు తగ్గట్టు ఫైనల్ మ్యాచ్ కోసం రోహిత్ సేన ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలో భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కివీస్ చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓటమి చవిచూసింది. అయితే అప్పటికంటే ఇప్పుడు భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కన్పిస్తోంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను గెలుచుకునేందుకు భారత్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ప్రస్తుత భారత జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత మరోసారి 2017లో భారత్‌కు టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ ఎడిషన్‌లో భారత్ తుది మెట్టుపై బోల్తా పడింది.
కానీ ఈసారి మాత్రం టీమిండియా వద్ద అద్బుతమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఎక్స్ ఫ్యాక్టర్లగా మారుతారని నేను అనుకోవడం లేదు. వారిద్దరూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అయినప్పటికి.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు కాస్త బలహీనంగా కన్పించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సీనియర్ ద్వయం నుంచి ఫైటింగ్ నాక్స్ ఆశించవచ్చు.
ప్రస్తుత జట్టుపై మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంగ్లండ్‌ను 3-0 తేడాతో ఓడించి ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టారు. ఇక్కడ కూడా గ్రూపు మ్యాచ్‌లన్నీ గెలిచి.. ఆ తర్వాత సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. రోహిత్ శర్మ అండ్ కో మంచి రిథమ్‌లో కన్పిస్తున్నారు.
అయితే బ్లాక్ క్యాప్స్‌ను ఓడించడం అంత సలువు కాదు. గతంలో చాలా టోర్నమెంట్లలో చివరవరకు వచ్చి ఓటములను ఎదుర్కొన్నారు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్‌పై వారికి మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీం పేర్కొన్నాడు.
చదవండి: పాతికేళ్ల పరాజయానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?