India Vs Sri Lanka T20 Series- 1st T20: స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. పర్యాటక జట్లను 3-0 వైట్‌వాష్ చేసి జోరు మీదున్న రోహిత్ సేన.. శ్రీలంకతో జరుగనున్న సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని భావిస్తోంది.
మరోవైపు.. ఆస్ట్రేలియా పర్యటనలో 1-4 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయిన లంక.. బలమైన భారత జట్టుపై గెలిచి తామేంటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో లక్నో వేదికగా జరిగే మొదటి టీ20 మ్యాచ్‌కు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తుది జట్ల అంచనా, ముఖాముఖి రికార్డులు, పిచ్ వాతావరణం తదితర అంశాలు..
ఇండియా వర్సెస్ శ్రీలంక మొదటి టీ20- ఎప్పుడు, ఎక్కడ?
►ఫిబ్రవరి 24
►లక్నో- వాజ్‌పేయి స్టేడియం
►రాత్రి 7 గంటలకు ఆరంభం
►స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్/భువనేశ్వర్ కుమార్.
శ్రీలంక: పథుమ్ నిసాంక, ధనుష్క గుణతిలక, కమిల్ మిషారా(వికెట్ కీపర్, దినేశ్ చండిమాల్, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, జెఫ్నే వాండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, దుష్మంత చమీర, లాహిరు కుమార.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూల పిచ్. ఇక్కడ 2018లో ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేయగా, రోహిత్ సెంచరీ సాధించాడు. అయితే ఉత్తరాదిన ఇంకా మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
ముఖాముఖి రికార్డులు:
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 22 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 14 మ్యాచ్‌ల్లో, శ్రీలంక 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది.
చదవండి: Sanju Samson: సంజూలో మంచి టాలెంట్ ఉంది.. సరైన రీతిలో వాడుకుంటాం: రోహిత్ శర్మ
💬 💬 "I'm excited to be back and raring to go."
— BCCI (@BCCI) February 23, 2022
Say Hello to all-rounder @imjadeja and vice-captain @Jaspritbumrah93 as they join #TeamIndia for the Sri Lanka series. 👋 👋@Paytm | #INDvSL pic.twitter.com/gpWG3UESjv
Comments
Please login to add a commentAdd a comment