వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది.
అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.
మరోవైపు యువ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా ఈ టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో లంక బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓటమి పాలైంది.
చదవండి: World Cup 2023: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment