India vs Sri Lanka, 1st ODI: టీమిండియాతో తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచింది. లంక కెప్టెన్ దసున్ షనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా అసోంలోని గువహటిలో గల బర్సపర వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌తో వన్డే సిరీస్ ఆరంభం కానుంది. కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై గతంలో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా గెలుపొందింది.
కాగా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడే నిమిత్తం శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్‌లో లంకను 2-1తో ఓడించింది. ఇక వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ వన్డే సిరీస్‌లోనూ ఫేవరెట్‌గా ఉండగా.. లంక జట్టులో అందరు ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు.
ఇషాన్ అవుట్! అర్ష్‌దీప్, కుల్దీప్ బెంచ్ మీదే..
ఊహించినట్లుగానే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అదే విధంగా టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. పేస్ విభాగంలో షమీ, సిరాజ్, ఉమ్రాన్‌కు ఛాన్స్ రాగా.. అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.
మరోవైపు.. స్పిన్నర్లలో కుల్దీప్‌నకు మొండిచేయి ఎదురైంది. సీనియర్ యజ్వేంద్ర చహల్, అక్షర్ పటేల్ తొలి వన్డే ఆడనున్నారు. ఇదిలా ఉంటే.. లంక తరఫున దిల్షాన్ మధుషంక వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు.
తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక:
పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.
చదవండి: Rohit Sharma: ఎందుకు ఏడుస్తున్నావు? నీ బూరె బుగ్గలు భలే బాగున్నాయి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment