పల్లెకెలె: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
19.5 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
చదవండి: IND vs SA T20 Series: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై
Hero of the match! 💪
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 11, 2022
What a knock by Dasun Shanaka 💥#SLvAUS #CheerForLions pic.twitter.com/n8ug04rQvh
Comments
Please login to add a commentAdd a comment