SL Vs AUS 3rd T20I: Sri Lanka Achieve Massive Record In Thrilling Win Over Australia - Sakshi
Sakshi News home page

SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!

Published Sun, Jun 12 2022 11:04 AM | Last Updated on Sun, Jun 12 2022 3:05 PM

Sri Lanka Achieve Massive Record In Thrilling Win Over Australia In 3rd T20I] - Sakshi

పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక​ క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక (25 బంతుల్లో 54 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది. 

తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్‌ (39; 6 ఫోర్లు), స్టొయినిస్‌ (38; 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్మిత్‌ (37 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
చదవండి: IND vs SA: 'అతడొక యంగ్‌ కెప్టెన్‌.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement