India vs Sri Lanka, 1st ODI: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. టీ20 సిరీస్‌లో శ్రీలంకను ఓడించిన భారత జట్టు ప్రస్తుతం వన్డేలకు సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువహటి వేదికగా దసున్ షనక బృందంతో రోహిత్ సేన మంగళవారం తొలి వన్డే ఆడనుంది. మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇక అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో మరింత బలంగా కనిపిస్తోంది. సిరీస్ గెలుపే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతుండగా.. లంక సైతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా వన్డే సిరీస్‌కు టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రాకతో.. టీ20లలో ఓపెనింగ్ చేసిన ఇషాన్ కిషన్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.
మరో యువ ఓపెనర్, వన్డేల్లో సత్తా చాటుతున్న శుబ్‌మన్ గిల్, రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌కు కూడా తుదిజట్టులో ఆడే అవకాశం దక్కకకపోవచ్చు. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న కేఎల్ రాహుల్‌కు తోడు శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో ఉన్న నేపథ్యంలో సూర్య వేచ్చి చూడాల్సిన పరిస్థితి.
ఇదిలా ఉంటే.. బౌలింగ్ విభాగంలో సీనియర్లు షమీ, సిరాజ్ రాకతో ఉమ్రాన్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అర్ష్‌దీప్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు తోడు స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
పిచ్, వాతావరణం
బర్సపర స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. ఈ గ్రౌండ్‌లో 2018లో ఒకే ఒక వన్డే జరిగింది. విండీస్ 322 పరుగులు చేసినా, భారత్ 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్, పాతుమ్ నిసాంక, అవిష్క, ధనంజయ, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, కుమార.
Comments
Please login to add a commentAdd a comment