
కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1తో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ మహీష్ తీక్షణ కీలక పాత్ర పోషించాడు. తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. అతడు 10 ఓవర్లలో 4 వికెట్లు తీసి 37 పరుగులు ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మహీష్ తీక్షణపై ప్రశంసల వర్షం కురిపించాడు.
"దక్షిణాఫ్రికాతో టీ 20 ల్లో ఆడేందుకు తొలుత తీక్షణను జట్టులోకి తీసుకున్నాము.. ఆనుహ్యంగా మరో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకున్నాను. కానీ నేను కెప్టెన్‌గా ఆ రిస్క్ తీసుకున్నాను. సెలెక్టర్లు ,కోచ్‌లు నాకు మద్దతు ఇచ్చారు. అది మాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది, ”అని మూడో వన్డే తర్వాత శనక వెల్లడించాడు. తీక్షణ ఇంతకు ముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడని, కుడి చేతి వాటం స్పిన్నర్ స్లీవ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నందున బ్యాట్స్‌మన్‌లు అతడి బౌలింగ్ ను ఆర్ధం చేసుకోవడం అంత సులభం కాదని దాసున్ శనక అన్నారు.
చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక..
Four wickets on ODI debut 💪
— ICC (@ICC) September 8, 2021
A memorable performance from Maheesh Theekshana!#SLvSA pic.twitter.com/l7ZxALaJF7