శ్రీలంక లయన్స్‌ వర్సెస్‌ బంగ్లా టైగర్స్‌.. గెలుపెవరిది? | Asia Cup 2023: Bangladesh Vs Sri Lanka Match Prediction – Who Will Win Today’s Match Between BAN Vs SL? - Sakshi
Sakshi News home page

Asia Cup 2023, BAN Vs SL: శ్రీలంక లయన్స్‌ వర్సెస్‌ బంగ్లా టైగర్స్‌.. గెలుపెవరిది?

Published Thu, Aug 31 2023 12:30 PM | Last Updated on Thu, Aug 31 2023 1:50 PM

Who will win todays match between BAN vs SL? - Sakshi

ఆసియాకప్‌-2023లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా క్యాండీ వేదికగా గురువారం శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక బ్లాస్టర్‌ మ్యాచ్‌ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లూక్కేద్దం

శ్రీలంక..
ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభానికి ముందు ఆతిథ్య శ్రీలంక వరుస షాక్‌లు తగిలాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ, అవిష్క ఫెర్నాండో వంటి స్టార్‌ ఆటగాళ్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. బ్యాటింగ్‌ పరంగా లంక పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి.. బౌలింగ్‌లో మాత్రం పేలవంగా ఉంది.

లహురు కుమారా,థీక్షణ మినహా పెద్దగా అనుభవం ఉన్న బౌలర్లు లేరు. యువ సంచలనంచ,పేసర్‌ మతీషా పతిరానా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం లంకకు కలిసిచ్చే ఆంశం. అదే విధంగా స్వదేశంలో శ్రీలంకకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

చివరగా ఆడిన 5 వన్డేల్లోనూ లంక విజయం సాధించింది. సొంత గడ్డపై ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న లంక.. వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫియర్స్‌లోనూ దుమ్మురేపింది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్‌..
బంగ్లాదేశ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బంగ్లా జట్టు తమ ఆఖరి రెండు వన్డే సిరీస్‌లలోనూ విజయం సాధించింది. ఇంగ్లండ్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌.. స్వదేశంలో ఆఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లా జట్టుకు బిగ్‌షాక్‌ తగిలింది.

స్టార్‌ ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ వైరల్‌ ఫీవర్‌ కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్ధానంలో అనముల్‌ హక్‌కు అవకాశం ఇచ్చారు. లిట్టన్‌ దాస్‌ దూరమైనప్పటికీ అఫీఫ్ హొస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, తోవిద్ హృదయ్ రూపంలో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. అదే విధంగా బౌలింగ్‌లో కూడా టాస్కిన్‌ అ‍హ్మద్‌, ముస్తిఫిజర్‌ రెహ్మన్‌, షకీబ్‌ వంటి స్టార్‌ బౌలర్లు ఉన్నారు. వీరి చెలరేగితే లంక బ్యాటర్లకు కష్టాలు తప్పవు.

తుది జట్లు(అంచనా)
బంగ్లాదేశ్‌
అఫీఫ్ హొస్సేన్, నయీమ్ షేక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్‌ కీపర్‌), తోవిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్‌), ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, మహేదీ హసన్

శ్రీలంక
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్‌ కీపర్‌), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్‌), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు కుమార, మతీశ పతిరణ
చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్‌- పాకిస్తాన్ మ్యాచ్‌ కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement