
కరాచీ: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్, పేస్ బౌలర్ హసన్ అలీలు మంచి స్నేహితులు. షాదాబ్ ఆరంగేట్రం చేసినప్పటి నుంచి హసన్‌తో కలిసి ప్రతీ సిరీస్ ఆడాడు. అంతేకాకుండా పలు కార్యక్రమాల్లో హసన్-షాదాబ్‌లు పాల్గొనడంతో వీర్దిదరి మధ్య మంచి సన్నిహితం ఉందని అందరూ భావించారు. అయితే తాజాగా శ్రీలంక సిరీస్‌కు వెన్నునొప్పి కారణంగా హసన్ అలీ దూరమయ్యాడు. దీంతో తొలిసారి హసన్ లేకుండా షాదాబ్ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే ఇదే విషయాన్ని ఓ మీడియా సమావేశంలో ‘హసన్ అలీ లేకుండా తొలిసారి ఆడుతున్నారు.. ఎలా ఫీలవుతున్నారు?’అంటూ ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి షాదాబ్ ఇచ్చిన సమాధానంతో అక్కడ ఉన్నవారంతా తెగ నవ్వడం మొదలుపెట్టారు. ఇంతకీ షాదాబ్ ఏమన్నాడంటే..
‘హసన్, నేను భార్యభర్తలం అనుకుంటున్నారే ఏంటి? మీరు అడిగిన విధానం చూస్తుంటే నాకు అలానే అనిపిస్తోంది(దీంతో అక్కడున్నవారు ఒక్కసారిగా నవ్వుకున్నారు)’అంటూ షాదాబ్ సరదాగా పేర్కొన్నాడు. అనంతరం ‘హసన్, నేను మంచి స్నేహితులం. చాలా రోజులుగా ప్రతీ సిరీస్‌లో పాల్గొంటున్నాం. ఈ సిరీస్‌లో నేను మాత్రమే కాకుండా జట్టు సభ్యులందరూ హసన్ అలీని మిస్సవుతున్నారు. సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తాడు’అంటూ షాదాబ్ హసన్‌ను ప్రశంసించాడు. ఇక షాదాబ్ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు నెటిజన్లు షాదాబ్ టైమింగ్‌ను మెచ్చుకుంటూ కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment