Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి.. | Pakistan fielder engage in synchronized fielding during first Test Against Bangladesh | Sakshi
Sakshi News home page

Ban Vs Pak Test Match: అరె ఇద్దరూ ఒకేసారి పరిగెత్తారు.. ఇద్దరూ ఒకేసారి డైవ్‌ చేశారు.. ఆఖరికి

Published Sat, Nov 27 2021 1:03 PM | Last Updated on Sat, Nov 27 2021 2:23 PM

Pakistan fielder engage in synchronized fielding during first Test Against Bangladesh - Sakshi

Ban Vs Pak: Pakistan fielder engage in synchronized fielding during first Test Against Bangladesh: ఛాటోగ్రామ్‌ వేదికగా పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 95 ఓవర్‌ వేసిన హసన్‌ అలీ బౌలింగ్‌లో మెహదీ హసన్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడాడు. అయితే ఫీల్డర్లు ఇమామ్-ఉల్-హక్‌, అబ్దుల్లా షఫీక్ బంతిని ఆపడానికి  ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఒకేసారి పరిగెత్తడంతో పాటు యాదృచ్చికంగా ఒకేసారి డైవ్‌ కూడా చేశారు. చివరకు బంతిని దొరకబుచ్చుకున్నారు. దీంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో  వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..  ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 330 పరుగులకు ఆలౌటైంది.

పాకిస్తాన్‌ బౌలర్లలో హసన్‌ అలీ ఐదు వికెట్లు పడగొట్టగా, షహీన్‌ ఆఫ్రిది, ఆస్రఫ్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌.. మిడిలార్డర్‌ మిడిలార్డర్‌ విఫలం అయినప్పటికీ, లిటన్ దాస్‌, ముష్ఫికర్‌ రహీం 206 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి గౌరవప్రదమైన స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా బ్యాటర్లలో  లిటన్‌ దాస్‌ (114),ముష్ఫికర్‌(91), మెహది హసన్‌ టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండి: IND Vs NZ: సూపర్‌ భరత్‌... సాహా స్థానంలో వచ్చీరాగానే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement