పాక్‌ బౌలర్‌పై ప్రశంసలు కురిపించిన పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ | Liam Livingstone Lauds Hasan Ali Impact In County Cricket | Sakshi
Sakshi News home page

IPL 2022: పాక్‌ బౌలర్‌ను ఆకాశానికెత్తిన పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌

Published Tue, Apr 26 2022 1:58 PM | Last Updated on Tue, Apr 26 2022 2:00 PM

Liam Livingstone Lauds Hasan Ali Impact In County Cricket - Sakshi

Liam Livingstone Lauds Hasan Ali: ఇంగ్లండ్‌ కౌంటీల్లో చెలరేగిపోతున్న పాకిస్థాన్‌ బౌలర్‌ హసన్‌ అలీపై పంజాబ్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాటర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2022లో లాంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్‌ అలీ గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో లివింగ్‌స్టోన్‌ పాక్‌ పేసర్‌ని కొనియాడాడు. లివింగ్‌స్టోన్‌కు లాంకాషైర్‌ హోం టీమ్‌ కావడంతో హసన్‌ అలీ ప్రదర్శనను ఆకాశానికెత్తుతూ, తన జట్టు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. వాట్‌ ఎ సైనింగ్‌.. వాట్‌ ఎ విన్‌ అంటూ రెడ్‌ రోసెస్‌తో హసన్‌ అలీకి, లాంకాషైర్‌ జట్టుకు విషెస్‌ తెలిపాడు. 


కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ వన్‌లో భాగంగా గ్లోస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకాషైర్‌ ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన హసన్‌.. లాంకాషైర్‌ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో గ్లోస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లాంకాషైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. లంకాషైర్‌ జట్టులో జోష్‌ బొహానన్‌ (231) డబుల్‌ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్‌ డేన్‌ విలాస్‌ (109) సెంచరీతో సత్తా చాటాడు. 
చదవండి: అంపైర్‌తో వాగ్వాదం.. ఆ కోపాన్ని బౌలర్‌పై చూపించాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement