
ఇంగ్లండ్ కు పాక్ బౌలర్ల షాక్..
► 211 పరుగులకు ఆలౌట్
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో పాక్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో పాక్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. టోర్నిలో ఆడిన అన్ని మ్యాచులు గెలిచి దూకుడు మీదున్న ఇంగ్లాండ్‌కు పాక్ బౌలర్లు షాక్ ఇచ్చారు. హసన్ అలీ 3/35, రుమాన్ రయీస్ 2/44, జునైద్ ఖాన్ 2/42 ల దాటికి ఇంగ్లండ్ 211 పరుగులకే కుప్పకూలింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి మ్యాచ్ ఆడుతున్నపాక్ బౌలర్ రుమాన్ రయూస్ ఓపెనర్ హెల్స్(13)ను అవుట్ చేసి దెబ్బకొట్టాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బెయిర్ స్టో(43), జోరూట్ (46), బెన్ స్టోక్స్(34), మోర్గాన్(33)లు పొరాడినా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోక పోవడం, భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్ పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్నిఉంచింది.