PC: ICC twitter
ఆసియాకప్-2022కు పాకిస్తాన్ యువ పేసర్ మహ్మద్ వసీమ్ వెన్ను నోప్పితో దూరమైన సంగతి తెలిసిందే. అయతే తాజాగా వసీం స్థానంలో ఆ జట్టు సీనియర్ పేసర్ హసన్ అలీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా బౌలింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడ్డాడు.
అతడిని వెంటనే ఐసీసీ అకాడమీ తరలించి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించగా.. గాయం తీవ్రమైనదిగానే తేలింది. ఈ క్రమంలో వసీం టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.అంతకుమందు పాక్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది మెకాలి గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఇప్పటికే అతడి స్థానాన్ని యువ పేసర్ మొహమ్మద్ హస్నైన్‌తో పాక్ భర్తీ చేసింది.
ఇక ఎక్స్‌ప్రెస్ పేసర్ హసన్ అలీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో పీసీబీ జట్టు నుంచి హసన్ ఊద్వసన పలికింది. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడిని పీసీబీ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
ఇక ఆనూహ్యంగా జట్టులోకి వచ్చిన హసన్ ఏ మేరకు చూడాలి మరి. ఇప్పటి వరకు 49 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అలీ 60 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో ఆగస్టు 28న ఆడనుంది.
చదవండి: Ind Vs Pak: రోహిత్ ‘హగ్’తో ఆనందంలో మునిగిపోయిన పాక్ ఫ్యాన్! నువ్వు గ్రేట్ భయ్యా!
Comments
Please login to add a commentAdd a comment