Viral Video: Babar Azam Pretends to Hit Hasan Ali With Bat Jokingly - Sakshi
Sakshi News home page

PSL 2023: బౌలర్‌ను బ్యాట్‌తో కొట్టడానికి వెళ్లిన పాకిస్తాన్‌ కెప్టెన్‌! వీడియో వైరల్‌

Published Fri, Feb 24 2023 1:43 PM | Last Updated on Fri, Feb 24 2023 2:00 PM

Babar Azam Pretends to Hit Hasan Ali With Bat Jokingly - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్ జల్మీ మరో ఓటమి చవి చూసింది. గురువారం ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పెషావర్   ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. పెషావర్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ బాబర్‌ ఆజం అద్భుతంగా రాణించాడు.

58 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్‌.. కేవలం 14.5 ఓవర్లలోనే చేధించింది. ఇస్లామాబాద్ బ్యాటర్లలో గుర్బాజ్‌(62) అర్ధశతకంతో చెలరేగగా.. వాన్ డెర్ డస్సెన్(42) పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ పేసర్‌ హసన్‌ అలీని బాబర్‌ తన బ్యాట్‌తో కొట్టేందుకు సరదగా ప్రయత్నించాడు.

ఏం జరిగిందంటే?
పెషావర్ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన హసన్‌ అలీ బౌలింగ్‌లో ఆఖరి బంతికి బాబర్‌ సింగిల్‌ తీశాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న బాబర్‌ను చూసి.. హసన్‌ అలీ నవ్వుతో ఏదో అన్నాడు. అందుకు బదులుగా బాబార్‌ తన బ్యాట్‌తో కొడతూ అన్నట్లగా సైగలు చేశాడు.

బాబర్‌ అలా చేసిన వెంటనే అలీ నవ్వుతో కొంచెం ముందుకు పరిగెత్తాడు. వీరిద్దరి చర్యను చూసిన సహాచర ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టిన హసన్‌ అలీ మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది.
చదవండి: IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌! కెప్టెన్‌గా స్మిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement