
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ బౌలింగ్ వేగానికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెలితే.. హసన్ అలీ ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా గడుపుతున్నాడు. మూడోరోజు ఆటలో భాగంగా గ్లూస్టర్‌షైర్ బ్యాటర్ జేమ్స్ బ్రేసీని క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాదాపు 150 కిమీ వేగంతో విసిరిన పదునైన యార్కర్ బ్యాట్స్‌మన్ కాళ్ల సందుల నుంచి వెళ్లి మిడిల్ స్టంప్‌ను ఎగురగొట్టింది. అయితే బంతి సూపర్ ఫాస్ట్‌గా రావడంతో స్టంప్ రెండు ముక్కలయింది. ఈ వీడియోనూ లంకాషైర్ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. కొత్త స్టంప్ ప్లీజ్.. చెప్పడానికి ఏం లేదు.. ఓ మై వర్డ్.. మేము ఇంకో స్టంప్ తెప్పించాల్సిందే అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హసన్ అలీ గ్లూస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో మెరిశాడు. అతని ధాటికి గూస్టర్‌షైర్ 252 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో లంకాషైర్‌కు 304 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకముందు లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌ను 556 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జోష్ బొహానన్ డబుల్ సెంచరీతో(231 పరుగులు) మెరవగా, కెప్టెన్ డేన్ విలాస్ 109 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.
చదవండి: Wriddiman Saha Case: సాహా వ్యవహారం.. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌పై రెండేళ్ల నిషేధం!
County Championship: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్
NEW STUMPS, PLEASE! 👀@RealHa55an 😲
— Lancashire Cricket (@lancscricket) April 23, 2022
🌹 #RedRoseTogether pic.twitter.com/KhjUz3TG6q
“Oh my word!” 😳
— Lancashire Cricket (@lancscricket) April 23, 2022
We’ll have to get another one of those, @RealHa55an! 🤣
🌹 #RedRoseTogether pic.twitter.com/XQO4reizR1