నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్‌ క్రికెటర్‌ | Hasan Ali Wants To Invite Indian Cricketers To Wedding | Sakshi
Sakshi News home page

నా పెళ్లికి వారిని ఆహ్వానిస్తా: పాక్‌ క్రికెటర్‌

Aug 5 2019 12:15 PM | Updated on Aug 5 2019 12:15 PM

Hasan Ali Wants To Invite Indian Cricketers To Wedding - Sakshi

కరాచీ : పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ హసన్‌ అలీ భారత్‌కు చెందిన షమీయా అర్జూను వివాహమాడుతున్నాడు. వచ్చే నెల 20వ తేదీన దుబాయ్‌లోని హోటల్‌ను ఈ నిఖా తంతు జరుగనుంది. అయితే తమ పెళ్లికి రావాలంటూ భారత క్రికెటర్లను హసన్‌ అలీ ఆహ్వానించనున్నాడు.  ఈ విషయాన్ని హసల్‌ అలీ తాజాగా స్పష్టం చేశాడు.‘ భారత​ క్రికెట్‌ జట్టును, ఆటగాళ్లను నా పెళ్లికి ఆహ్వానిస్తా.  మేమంతా క్రికెటర్లమే. మా మధ్య పోరు ఫీల్డ్‌లోనే కానీ బయట కాదు. నా పెళ్లికి భారత క్రికెటర్లు వస్తే చాలా సంతోషిస్తా’ అని హసన్‌ అలీ పేర్కొన్నాడు.

షమీయా అర్జూతో తన వివాహాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచాలనుకున్నప్పటికీ మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాంతో తాను అధికార ప్రకటన చేయాలని నిర్ణయించుకుని పెళ్లికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందన్నాడు. రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశంతోనే బహిరంగ ప్రకటన చేశానని హసన్‌ అలీ చెప్పుకొచ్చాడు. హరియాణా రాష్ట్రానికి చెందిన షమీయా భారత్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. అనంతరం ఫ్లైట్‌ ఇంజనీర్‌గా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పరిణయం దాకా వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement