
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ 2022) చివరి అంకానికి చేరుకుంది. లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఎలిమినేటర్ 2లో భాగంగా శుక్రవారం లాహెర్ ఖలందర్స్ ఇస్లామాబాద్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిన్ అఫ్రిది తన చివరి ఓవర్ వేశాడు. ఇస్లామాబాద్ గెలవాలంటే 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. క్రీజులో హిట్టర్ అసిఫ్ అలీతో పాటు హసన్ అలీ ఉన్నారు.
ఓవర్ తొలి బంతిని అసిఫ్ బౌండరీ పంపించాడు. రెండో బంతిని సింగిల్ తీయడంతో హసన్ అలీ స్ట్రైక్‌కు వచ్చాడు. మూడో బంతిని హసన్ భారీ షాట్ ఆడినప్పటికి బంతి వెళ్లి డేవిడ్ వీస్ చేతిలో పడింది. కానీ రిప్లేలో నోబాల్ అని తేలింది. అప్పటికే ఒక పరుగు పూర్తైంది. ఆ తర్వాత ఫ్రీ హిట్‌లోనూ అసిఫ్ అలీ కూడా అదే తరహాలో భారీ షాట్ ఆడాడు. లాంగాన్ దిశలో ఫీల్డర్ క్యాచ్ తీసుకున్నప్పటికి కౌంట్ కిందకు రాదు. అలా రెండుసార్లు ఔట్ నుంచి బచాయించినప్పటికి ఇద్దరు అలీలు మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలందర్స్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. షఫీక్ 52 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కమ్రాన్ గులామ్ 30, డేవిడ్ వీస్ 28 నాటౌట్, మహ్మద్ హఫీజ్ 28 పరుగులు చేశారు. అనంతరం ఇస్లామాబాద్ యునైటెడ్స్ 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అజమ్ ఖాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: Ruturaj Gaikwad: యువ క్రికెటర్‌ను వెంటాడిన దురదృష్టం.. లంకతో టి20 సిరీస్‌కు దూరం
Ind Vs SL 1st T20I: అక్కడ ఉంది శ్రేయాస్ అయ్యర్.. డౌట్ అక్కర్లేదు
— Sports Hustle (@SportsHustle3) February 25, 2022
— Sports Hustle (@SportsHustle3) February 25, 2022