T20 World Cup 2022- India Vs Pakistan- Rishabh Pant: దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎల్లప్పుడూ తనకు ప్రత్యేకమేనని టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అన్నాడు. భారత్- పాక్ మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమాహారమని.. ఆటగాళ్లతో పాటు అభిమానులందరూ ఎమోషనల్‌గా ఉంటారని పేర్కొన్నాడు.
ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత చుట్టూ ఉద్వేగపూరిత వాతావరణం ఉంటుందని.. ఫ్యాన్స్ కేరింతలు, కోలాహలం.. అదో గొప్ప ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. జాతీయ గీతం పాడుతుంటే తన రోమాలు నిక్కబొడుచుకుంటాయని.. ఆ భావనను మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
పరాభవానికి బదులు తీర్చుకునేందుకు
టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న టీమిండియా తలపడనుంది. గతేడాది యూఏఈలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దాయాదితో పోరు నేపథ్యంలో ఇప్పటికే తుది జట్టును ఎంపిక చేసుకున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
ఒంటి చేత్తో రెండు సిక్స్‌లు
ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న రిషభ్ పంత్.. ప్రపంచకప్-2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్ తాలుకు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ఐసీసీతో అతడు మాట్లాడుతూ.. ‘‘నాకింకా గుర్తుంది. ఆ మ్యాచ్‌లో హసన్ అలీ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో నేను వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాను.
ఆదిలోనే మేము వికెట్లు కోల్పోయిన కారణంగా రన్‌రేటుపై దృష్టి సారించాం. నేను, విరాట్ కలిసి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ క్రమంలో నేను ఒంటిచేత్తో రెండు సిక్స్‌లు కొట్టాను. నా స్పెషల్ షాట్‌ను ఎగ్జిక్యూట్ చేశాను’’ అని పేర్కొన్నాడు.
ఇక రన్‌మెషీన్ విరాట్ కోహ్లితో కలిసి ఆడటం గురించి చెబుతూ.. కఠిన పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో కోహ్లిని చూసి నేర్చుకోవాలని.. తనతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంతో బాగుంటుందని పంత్ అన్నాడు. కాగా ప్రపంచకప్-2021లో పాక్‌తో మ్యాచ్‌లో పంత్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులు సాధించాడు. కోహ్లి 57 పరుగులతో భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన అనూహ్యంగా 10 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
పంత్ ఆర్ డీకే?!
ఫినిషర్‌గా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత రిషభ్ పంత్‌కు అతడి నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్-2022లో పాక్‌తో ఆరంభ మ్యాచ్‌లో వీరిద్దరిలో తుదిజట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్న అంశం ఆసక్తికరంగా మారింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: Rohit Sharma: 'టైటిల్ గెలవాలంటే చేయాల్సింది చాలా ఉంది'
Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక
Comments
Please login to add a commentAdd a comment