బాబర్‌ను హత్తుకున్న ఉస్మాన్ ఖవాజా కూతురు (PC: X)
ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్‌మస్ సందర్భంగా ఆసీస్ క్రికెటర్లకు స్వీట్ షాకిచ్చారు పాక్ ప్లేయర్లు. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఇండోర్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు.
క్రిస్‌మస్ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ సహా డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు.
Warm wishes and heartfelt gifts for the Australian players and their families at the MCG indoor nets 🎁✨ pic.twitter.com/u43mJEpBTR
— Pakistan Cricket (@TheRealPCB) December 25, 2023
ఇక ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూతుళ్లు.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
A very cute moment between Babar Azam and Usman Khawaja's daughter ♥️♥️ #AUSvPAKpic.twitter.com/GP5NhpJ95f
— Farid Khan (@_FaridKhan) December 25, 2023
ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాక్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది.
చదవండి: స్టార్ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్ బోర్డు.. రెండేళ్ల నిషేధం!
Comments
Please login to add a commentAdd a comment