బాబర్ ఆజం బౌల్డ్ (PC: CA)- మహ్మద్ యూసఫ్
ఆస్ట్రేలియా పర్యటనలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజంనకు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అండగా నిలిచాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనపుడు ఓపికగా వేచి చూడాలని సూచించాడు. కఠిన సవాళ్లు ఎదురైపుడు మరింత ధైర్యంగా ముందుకు సాగాలే తప్ప డీలా పడకూడదంటూ బాబర్‌కు మద్దతుగా నిలిచాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ విఫలమైన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాన్ మసూద్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. అతడి సారథ్యంలో తొలిసారిగా.. పాకిస్తాన్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది.
ఇందులో భాగంగా తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్ జట్టు.. రెండో టెస్టులోనైనా పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 318 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ రెండు మ్యాచ్‌లలోనూ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. మొదటి టెస్టులో 35 పరుగులు సాధించిన బాబర్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బుధవారం నాటి ఆటలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో నమ్మశక్యం కాని రీతిలో బౌల్డ్ అయ్యాడు.
UNBELIEVABLE!
— cricket.com.au (@cricketcomau) December 27, 2023
Pat Cummins gets rid of Babar Azam again - with another BEAUTY! #OhWhatAFeeling @Toyota_Aus #AUSvPAK pic.twitter.com/iXQ6M7E10l
ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నెట్టింట అతడిపై ట్రోల్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ యూసఫ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘‘ధైర్యంగా ఉండు. పరిస్థితులు తప్పక మెరుగుపడతాయి’’ అంటూ బాబర్ ఆజంకు అండగా నిలిచాడు. ఇపుడు తుఫాను ఉన్నంత మాత్రాన.. ఎల్లకాలం వాన కురుస్తూనే ఉండదు కదా అంటూ త్వరలోనే.. తిరిగి మునుపటి ఫామ్ అందుకోవాలని ఆకాంక్షించాడు.
Be strong now because things will get better,it might be stormy now, but it can't rain forever. pic.twitter.com/zGjYWV1jNJ
— Mohammad Yousaf (@yousaf1788) December 27, 2023
Comments
Please login to add a commentAdd a comment