బ్రిస్బేన్: తన రికార్డులను చూసి షేన్ వార్న్ మాట్లాడితే బాగుంటుందని ఆసీస్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఘాటుగా బదులిచ్చాడు. ‘ నీవు అప్పుడప్పుడు ఆడే ఏవో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్ జట్టులో కొనసాగడానికి ఉపయోగపడవు. ముందుగా ఆసీస్ జట్టులో ఆడాలంటే ఎటువంటి ప్రదర్శన చేయాలో తెలుసుకో. ఖవాజాను తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం భేష్’ అంటూ వార్న్ పేర్కొన్నాడు. దాంతో వార్న్-ఖవాజాల మధ్య వార్ మొదలైంది. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగాలంటే తాను ఏమి చేయాలో తనకు తెలుసంటూ ఖవాజ్ మండిపడ్డాడు. అదే సమయంలో ఒకవేళ నీకు ఏమైనా అవసరం ఉంటే అలా చేయడానికి యత్నించు అంటూ చురకలంటించాడు.
‘నేను ఎప్పుడూ కూల్‌గా ఉంటాను. అసలు వార్న్ క్వశ్చన్‌కు ఆన్సర్ చెప్పాల్పిన అవసరం నాకు లేదు. నేను బ్యాట్స్‌మన్. నాకు పరుగులు చేయడం మాత్రమే తెలుసు. అదే నాకు కరెన్సీతో సమానం. నా రికార్డులు చూసి మాట్లాడు. నా షీల్డ్ రికార్డు చూశావా. దేశవాళీ క్రికెట్‌లో నా వన్డే రికార్డు నీకు తెలుసా. ఆస్ట్రేలియా తరఫున నేను సాధించిన రికార్డు కూడా చూడు. అలాగే బీబీఎల్ రికార్డును కూడా పర్యవేక్షించుకో. నేను ఎక్కడ ఆడినా పరుగులే చేసే జట్టులో కొనసాగా. అంతేగానీ నువ్వు ఏదో సలహా చెబితే నా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేదు.
ఒకవేళ ఏమైనా మార్పు కావాలంటే నువ్వు ట్రై చేయ్’ అంటూ వార్న్‌కు ఖవాజా కౌంటర్ ఇచ్చాడు.పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ఖవాజాపై వేటు పడింది. ఎప్పట్నుంచో ఆసీస్ తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా కొనసాగుతున్న ఖావాజాను పాకిస్తాన్‌తో సిరీస్‌కు తప్పించారు. ఇటీవల కాలంలో ఖవాజా ఆకట్టుకునే ప్రదర్శన చేయకపోవడంతో అతనిపై తప్పిస్తూ సీఏ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతో సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్ధించిన వార్న్.. ఖవాజాను కించపరిచేలా మాట్లాడాడు. ఆసీస్ జట్టులో కొనసాగాలంటే ఆడపా దడపా ప్రదర్శనలు సరిపోవంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు.
Comments
Please login to add a commentAdd a comment