
సిడ్నీ:యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 479 పరుగులు చేసింది.193/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. మరో రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దాంతో ఆసీస్‌కు 133 పరుగుల తొలి ఇన్నింగ్స్ లభించింది.
ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్ ఆటగాడు ఉస్మాన్ ఖాజా(171;381 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్సర్) భారీ శతకం సాధించాడు. 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఖాజా.. మరో 80 పరుగుల్ని పిండుకున్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. అయితే మరో ఓవర్ నైట్ ఆటగాడు స్మిత్(83) మూడో వికెట్‌గా అవుటైన తరువాత ఖాజా మరింత నిలకడగా ఆడాడు. షాన్ మార్ష్(98 బ్యాటింగ్;207 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి 101 పరుగుల్ని జత చేసిన తరువాత ఖాజా నాల్గో వికెట్‌గా అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి షాన్ మార్ష్‌కు జతగా మిచెల్ మార్ష్(63 బ్యాటింగ్; 87 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.