Ashes 2023 Eng vs Aus 1st Test Day 2: Khawaja Ton Powers Australia to 311 - Sakshi
Sakshi News home page

Ashes 2023: పట్టుదలగా నిలబడ్డ ఖ్వాజా.. కోలుకున్న ఆస్ట్రేలియా! మరో 82 పరుగులు చేస్తే..

Published Sun, Jun 18 2023 8:30 AM | Last Updated on Sun, Jun 18 2023 10:29 AM

Ashes 2023 Eng Vs Aus 1st Test Day 2: Khawaja Ton Powers Australia t0 311 - Sakshi

ఖ్వాజా సెంచరీ.. కోలుకున్న ఆస్ట్రేలియా

England vs Australia, 1st Test- బర్మింగ్‌హమ్‌: ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా (279 బంతుల్లో 126 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) మొండి పట్టుదలతో ఆడటంతో... ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో ఆస్ట్రేలియా కోలుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు (393/8 డిక్లేర్డ్‌)కు ఆస్ట్రేలియా మరో 82 పరుగుల దూరంలో ఉంది.

ఖ్వాజాతో కలిసి అలెక్స్‌ క్యారీ (80 బంతుల్లో 52 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ సెంచరీతో క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 14/0తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో డేవిడ్‌ వార్నర్‌ (27 బంతుల్లో 9; 2 ఫోర్లు), లబుషేన్‌ (0)లను బ్రాడ్‌ అవుట్‌ చేశాడు.

కాసేపటికి స్టీవ్‌ స్మిత్‌ (59 బంతుల్లో 16) కూడా పెవిలియన్‌ చేరడంతో ఆస్ట్రేలిచయా 67 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రావిస్‌ హెడ్‌ (63 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్‌) తో ఖ్వాజా నాలుగో వికెట్‌కు 81 పరుగులు... గ్రీన్‌ (68 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌)తో ఐదో వికెట్‌కు  72 పరుగులు జత చేసి ఆదుకున్నాడు. గ్రీన్‌ అవుటయ్యాక వచ్చిన క్యారీ ఇంగ్లండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఖ్వాజాతో ఆరో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు.  

చదవండి: వరల్డ్‌కప్‌ క్వాలిఫియర్‌ మ్యాచ్‌లకు సర్వం సిద్దం.. ఫోటోలకు ఫోజులిచ్చిన కెప్టెన్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement