సౌతాంప్టన్: మెగా టోర్నీ ప్రపంచకప్ అసలు సమరం ఇంకా మొదలే కాలేదు. ఈలోగానే పలు జట్లను గాయాల బెడద బాధిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్‌లు గాయాల బారిన పడగా, టీమిండియాలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ఆసీస్ కూడా చేరింది.ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా గాయపడ్డాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి ఎడమ మోకాలికి బంతి తగిలింది. దీంతో వెంటనే ఆసీస్ వైద్యుడు వచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఖవాజా మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.
అయితే అనంతరం అతడు బ్యాటింగ్ చేసి ఇరగదీశాడు. 105 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక నిర్దేశించిన 240 పరుగుల ఛేదనలో ఖవాజా 89 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఖవాజా గాయం తీవ్రత పెద్దది కాదని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాగానే ఉన్నా అసలు పోరు వరకు గాయం ఏమైనా తిరుగబడుతుందో అని ఆసీస్ ఆందోళనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment