తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా 262 పరుగులకు ఆలౌటైంది. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్‌ను అక్షర్ పటేల్(74), అశ్విన్(31)ను అదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు.
ఇక కేవలం ఒక్క పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలపెట్టిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజులో ట్రెవిస్ హెడ్(39), మార్నస్ లబుషేన్(16) పరుగులతో ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్ సూపర్ క్యాచ్..
కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ ఊస్మాన్ ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ సంచలన క్యాచ్‌తో ఖవాజాను పెవిలియన్‌కు పంపాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో ఐదో బంతికి పాడిల్ స్వీప్ పాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్.. తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ, తన కుడివైపునకు వెళ్తున్న బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 6 పరుగులు చేసిన నిరాశతో పెవిలియన్‌కు చేరాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా రివర్స్ షాట్‌కు ప్రయత్నించి ఖవాజా తన వికెట్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో ఖవాజా పెవిలియన్‌ను పంపాడు.
Ravindra Jadeja strikes for India - Khawaja goes now. Great start by Jadeja!
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2023
Comments
Please login to add a commentAdd a comment