
ఖాజా అజేయ సెంచరీ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 307/6
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు
అడిలైడ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (285 బంతుల్లో 138 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 102 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోరుు 307 పరుగులు చేసింది. రెండు టెస్టుల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొన్న ఆసీస్‌కు ఈ సిరీస్‌లో ఖాజాదే తొలి సెంచరీ. రోజంతా క్రీజులో నిలిచిన తనకిది ఓవరాల్‌గా ఐదో శతకం. అలాగే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (113 బంతుల్లో 59; 8ఫోర్లు, 1సిక్స్), హ్యాండ్‌స కోంబ్ (78 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఖాజాతో పాటు క్రీజులో మిచెల్ స్టార్క్ (16 బ్యాటింగ్) ఉండగా ఆసీస్ 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. అబాట్‌కు మూడు వికెట్లు దక్కారుు.
డు ప్లెసిస్ అప్పీల్‌పై ఐసీసీ అసంతృప్తి
బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలినా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అప్పీల్ చేసుకోవాలని నిర్ణరుుంచడంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిర్ణయాన్ని డు ప్లెసిస్ అంగీకరించకపోవడం నిరాశపరిచింది. ఇక అతడి అప్పీల్‌ను విచారించేందుకు జ్యుడీషియల్ కమిషనర్‌ను ఏర్పాటు చేస్తాం’ అని ఐసీసీ పేర్కొంది.