ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. వార్నర్, లబుషేన్, స్మిత్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట... ఖ్వాజా ఇంగ్లీష్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు.
ఖ్వాజా విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్ క్యారీ(52) పరుగులతో ఉన్నారు.
ఖ్వాజా స్పెషల్ సెల్‌బ్రెషన్
ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్ సెల్‌బ్రెషన్స్ జరపుకున్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్‌ను కిందకు విసిరి, ఆసీస్ డ్రస్సెంగ్ రూమ్ వైపు చూస్తూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
కాగా ఖ్వాజాకు ఇంగ్లండ్ గడ్డపై ఇదే తొలి సెంచరీ. అందుకే ఖ్వాజా అంతగా ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఖ్వాజాకు 15 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఇది ఖ్వాజాకు 15వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఖ్వాజా సెల్‌బ్రెషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు
A magnificent 💯 from Usman Khawaja 😍
— Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023
The south-paw fights against all odds to get Australia back in the game 👊#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/yaz1Y7gIt1
Comments
Please login to add a commentAdd a comment