
ఐపీఎల్ నుంచి డు ప్లెసిస్ అవుట్
ఐపీఎల్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చేతి వేలు విరగడంతో జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్-9 సీజన్ నుంచి తప్పుకున్నాడు.డు ప్లెసిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఎడంచేతి బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను పుణే జట్టు తీసుకుంది.