ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాడు.
అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంక్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్‌హమ్‌షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్‌హమ్‌షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్‌షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment