మాంచెస్టర్ : తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ స్పందించాడు. ఇప్పుడప్పుడే ఆటకు గుడ్‌బై చెప్పే ఆలోచనేదీ లేదని ప్రకటించాడు. సోమవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచన నాకు లేదు. వికెట్ల దాహంతో ఉన్నా.. ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్నా’నని పేర్కొన్నాడు. కొంత కాలంగా గాయాలు, పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అండర్సన్ ... పాకిస్తాన్‌తో ముగిసిన తొలి టెస్టులో అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 1/63, రెండో ఇన్నింగ్స్‌లో 0/34తో పేలవ ప్రదర్శన కనబరిచాడు. త్వరలోనే పూర్వపు బౌలింగ్ లయను అందుకుంటానని... రెండో టెస్టులో బాగా ఆడేందుకు ప్రయత్నిస్తానని 38 ఏళ్ల అండర్సన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఘనత వహించిన అండర్సన్ 154 టెస్టుల్లో.. 590 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment