
500 వికెట్ల క్లబ్‌లో అండర్సన్
టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పడగొట్టిన ఆరో ఆటగాడిగా ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రికార్డులకెక్కాడు. లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను బౌల్డ్ చేసి అండర్సన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. 129 టెస్టుల్లో జిమ్మీ ఈ ఘనత సాధించాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్ 71 పరుగుల ఆధిక్యం సాధించింది.