
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఘోర పరాజయాలు నమోదు చేసింది. తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. రెండో టెస్టులో ఏకంగా 275 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఒకవైపు ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగుతుంటే.. అదే పిచ్‌లపై ఇంగ్లండ్ బౌలర్లు విఫలమవ్వడం ఆసక్తి కలిగించింది.
చదవండి: జీవితంలో మళ్లీ టెస్టులు ఆడతాననుకోలేదు: కేఎల్ రాహుల్
ఇంగ్లండ్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. రైట్ లెంగ్త్(గుడ్‌లెంగ్త్) విసరడంలో విఫలమయ్యారంటూ క్రీడా విశ్లేషకులు విమర్శించారు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా మా బౌలర్ల వైఫల్యం ఉందంటూ ఒప్పుకోవడం కొసమెరుపు. అయితే ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ మాత్రం తమ బౌలింగ్‌పై వస్తున్న విమర్శలను తన శైలిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. డిసెంబర్ 26 నుంచి మూడోటెస్టు జరగనున్న నేపథ్యంలో అండర్సన్ టెలిగ్రాఫ్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు.
'మేం బౌలింగ్ బాగా చేయలేదని విమర్శిస్తున్నారు. ఒక బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడండి. రైట్ లెంగ్త్ వేయలేదని మీరు అంటున్నారు.. కానీ మ్యాచ్ ప్రారంభంలో రెండురోజులు గుడ్‌లెంగ్త్‌తో బౌలింగ్ వేయడానికి మా బెస్ట్ ఇచ్చాం. ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది..మాకు కలిసిరాలేదు అంతే తేడా. మ్యాచ్‌లు ఆడేటప్పుడు లంచ్ విరామం, టీ విరామం సమయాల్లో మా బౌలర్లంతా ఒక గ్రూఫ్‌గా ఏర్పడి ఎక్కడ తప్పు చేశామన్నది చర్చించుకుంటాం. గుడ్‌లెంగ్త్ బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని ఒకరికి ఒకరం చెప్పుకుంటాం. ఇక మా బౌలింగ్‌ను విమర్శించే హక్కు మీకు(క్రీడా విశ్లేషకులు) లేదు. అడిలైడ్ టెస్టులో మేము ఆస్ట్రేలియాను రెండు ఇన్నింగ్స్‌లోనూ ఆలౌట్ చేశాం..ఇది మాత్రం మీకు కనబడలేదా? మా బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇక ఆస్ట్రేలియన్స్ మాకంటే బాగా ఆడారు. కానీ రేపటి మ్యాచ్‌లో మేం ఆసీస్‌ను ఓడించే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment