Ashes 2023: England Announce Squad For Ashes 2023 4th Test, James Anderson Included - Sakshi
Sakshi News home page

యాషెస్‌ నాలుగో టెస్ట్‌.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌

Published Mon, Jul 17 2023 4:38 PM | Last Updated on Mon, Jul 17 2023 6:36 PM

England Name Playing XI For 4th Ashes Test - Sakshi

మాంచెస్టర్‌ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇవాళ (జులై 17)  ప్రకటించింది. ముందుగా ప్రచారం జరిగిన విధంగా మూడో టెస్ట్‌ ఆడిన జట్టునే ఈసీబీ కొనసాగించలేదు. నాలుగో టెస్ట్‌ కోసం ఈసీబీ ఓ మార్పు చేసింది. ఓలీ రాబిన్సన్‌ స్థానంలో వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది. ఓపెనర్లుగా బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే, వన్‌డౌన్‌లో మొయిన్‌ అలీ, నాలుగో ప్లేస్‌లో జో రూట్‌, ఆతర్వాత హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జోనాథన్‌ బెయిర్‌స్టో, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ వరుస స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

కాగా, మూడో టెస్ట్‌లో ఆసీస్‌పై ఇంగ్లండ్‌ చిరస్మరణీ విజయం సాధించిన తర్వాత ఇంగ్లీష్‌ మేనేజ్‌మెంట్‌ అదే జట్టును కొనసాగిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈసీబీ మాత్రం నాలుగో టెస్ట్‌ కోసం రాబిన్సన్‌ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆండర్సన్‌ వైపే మొగ్గు చూపింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మూడో టెస్ట్‌ సందర్భంగా రాబిన్సన్‌ స్వల్పంగా గాయపడ్డాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ కూడా చేయలేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్లతో రాణించిన రాబిన్సన్‌ మూడో టెస్ట్‌లో మాత్రం తేలిపోయాడు.  

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్‌ సిరీస్‌లో పర్యాటక ఆసీస్‌ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. బజ్‌బాల్‌ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్‌ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. 

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు:
బెన్‌ డకెట్‌, జాక్‌ క్రాలే,మొయిన్‌ అలీ, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జోనాథన్‌ బెయిర్‌స్టో, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement