Ollie Robinson
-
ఒకే ఓవర్లో 43 రన్స్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి!
ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లిష్ కౌంటీ చాంపియన్‌షిప్ 134 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.కాగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా లీసస్టర్‌షైర్- ససెక్స్ జట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ బుధవారంతో ముగిసింది. ఆఖరి రోజు ఆటలో భాగంగా రాబిన్సన్ బౌలింగ్‌లో లీసస్టర్‌షైర్ వికెట్ కీపర్ బ్యాటర్ లూయీస్ కింబర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1బ్రిగ్టన్లోని హోవ్ గ్రౌండ్లో ఓలీ రాబిన్సన్ చేసిన పొరపాట్లను తనకు అనుకూలంగా మార్చుకుని బ్యాట్‌తో అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏకంగా 43 పరుగులు పిండుకున్నాడు. వరుసగా 6, 6, 4, 6, 4, 6, 4, 6, 1 రన్స్ స్కోరు చేశాడు.ఈ ఓవర్లో రెండో బంతి నో బాల్ కాగా.. తదుపరి మూడు డెలివరీల్లో 4, 6, 4 పరుగులు రాబట్టిన లూయీస్ కింబర్.. ఐదో బంతి మళ్లీ నోబాల్‌గా పడగా.. ఆ తర్వాతి డెలివరీని మళ్లీ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత మళ్లీ నో బాల్ పడటంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిక్స్ కొట్టాడు.అయితే, చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగాడు. అలా ఒకే ఓవర్లో మొత్తంగా 43 రన్స్ రాబట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతుల్లోనే 243 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. అయితే, లీసస్టర్షైర్ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ససెక్స్ 18 పరుగుల తేడాతో గెలిచింది. కాగా రాబిన్సన్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 20 టెస్టులాడి 76 వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్లు1. ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 20242. అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 19983. షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024.LOUIS KIMBER HAS TAKEN 43 OFF AN OVER pic.twitter.com/kQ4cLUhKN9— Vitality County Championship (@CountyChamp) June 26, 2024 -
టీమిండియాతో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ధర్మశాల వేదికగా టీమిండియాతో రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇవాళ ప్రకటించారు. ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్ట్‌లో ఆడిన ఓలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ అదనపు పేసర్‌ను బరిలోకి దించుతుందని అంతా ఊహించారు. అయితే ఇంగ్లండ్ మేనేజ్మెంట్ పేసర్ స్థానంలో మరో పేసర్కే అవకాశం ఇచ్చింది. మొత్తంగా ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మార్క్ వుడ్‌తో పాటు వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తుది జట్టుకు ఎంపికయ్యారు. రాబిన్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వుడ్.. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్, రాజ్‌కోట్ మ్యాచ్‌ల్లో ఆడిన వుడ్ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చకపోవడంతో నాలుగో టెస్ట్‌కు ఎంపిక కాలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వుడ్ 55.5 సగటున కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. రాబిన్సన్ విషమానికొస్తే.. ఈ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను పేలవ ప్రదర్శన కనబర్చి తుది జట్టులో (ఐదో టెస్ట్) స్థానం కోల్పోయాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఆడిన రాబిన్సన్ కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రాబిన్సన్కు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
భారత్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
రాంఛీ వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి23) నుంచి ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని స్టోక్స్ సేన భావిస్తుంది. ఈ క్రమంలో రాంఛీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఇంగ్లండ్ ప్రకటించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడో టెస్టులో దారుణంగా విఫలమైన మార్క్ వుడ్, రెహన్ ఆహ్మద్‌పై మెనెజ్‌మెంట్ వేటు వేసింది. వుడ్ స్ధానంలో స్టార్ పేసర్ ఓలీ రాబిన్సన్, ఆహ్మద్ ప్లేస్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్ స్టోకు మరో అవకాశమిచ్చారు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, ఒల్లీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్ -
యాషెస్ నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించింది. ముందుగా ప్రచారం జరిగిన విధంగా మూడో టెస్ట్ ఆడిన జట్టునే ఈసీబీ కొనసాగించలేదు. నాలుగో టెస్ట్ కోసం ఈసీబీ ఓ మార్పు చేసింది. ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు. One change for the 4th @LV_Cricket #Ashes Test at @EmiratesOT 🏟🏏 — England Cricket (@englandcricket) July 17, 2023 మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది. ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలే, వన్‌డౌన్‌లో మొయిన్ అలీ, నాలుగో ప్లేస్‌లో జో రూట్, ఆతర్వాత హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ వరుస స్థానాల్లో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. కాగా, మూడో టెస్ట్‌లో ఆసీస్‌పై ఇంగ్లండ్ చిరస్మరణీ విజయం సాధించిన తర్వాత ఇంగ్లీష్ మేనేజ్మెంట్ అదే జట్టును కొనసాగిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈసీబీ మాత్రం నాలుగో టెస్ట్ కోసం రాబిన్సన్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఆండర్సన్ వైపే మొగ్గు చూపింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. మూడో టెస్ట్ సందర్భంగా రాబిన్సన్ స్వల్పంగా గాయపడ్డాడు. అతను రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ కూడా చేయలేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో 10 వికెట్లతో రాణించిన రాబిన్సన్ మూడో టెస్ట్‌లో మాత్రం తేలిపోయాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆసీస్ ప్రస్తుతానికి 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలువగా.. హోరాహోరీగా సాగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. బజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్‌లో బొక్కబోర్లా పడటంతో మూడో టెస్ట్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే,మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జోనాథన్ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ -
లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ తొండాట ఆడాడు. నాలుగో రోజు ఆటలో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతను.. క్యాచ్ పట్టలేదని తెలిసినా సంబరాలు చేసుకుని ఇంగ్లండ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 55వ ఓవర్లో హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. Whi this Not out . The way labuschagne was celebrating, it shows the great sportsmanship of Aussies 😂. @ShubmanGill pic.twitter.com/PgYdwIyase — niraj kumar (@nirajku1234) June 19, 2023 రాబిన్సన్ రివ్యూకి వెళ్లగా బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వడంతో ఫ్యాన్స్ లబూషేన్‌ను ఏకిపారేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం క్రీడా స్పూర్తికి వ్యతిరేకమని చురకలంటిస్తున్నారు. తొండాటకు ఆసీస్ ఆటగాళ్లు కేరాఫ్ అడ్రస్ అని విరుచుకుపడుతున్నారు. Marnus Labuschagne really grassed the ball and dragged it on the ground before picking it up and throwing it in the air to celebrate a catch. Whatever happened to shame, Labushame?#ENGvsAUS #Ashes2023 — AJ (@UtdBrunoJr) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. Im afraid I've got no choice but to respect Marnus Labuschagne blatantly cheating in front of a stadium full of cameras and expecting to get away with it. — Jack (@JackInPogForm) June 19, 2023 ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్‌కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్‌బాల్ క్రికెట్లో జోరుమీదున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి. ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్‌కు వచ్చిన రాబిన్సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్సన్ ఇలా మిస్‌మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్‌గా సాగిపోతున్న మ్యాచ్‌లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు. 281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు కావాలి. pic.twitter.com/abYYFCVMub — Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023 చదవండి: ఔటయ్యి కూడా చరిత్రకెక్కిన జో రూట్