ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఆట ఆఖరిరోజు విజయానికి ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా.. ఆసీస్ మరో 174 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఐదోరోజు ఆటలో తొలి సెషన్ కీలకం కానుంది. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగుతారా.. లేక ఆసీస్ బ్యాటర్లు సమర్థంగా రాణించి ఆసీస్‌కు విజయాన్ని అందిస్తారా అనేది చూడాలి. బజ్‌బాల్ క్రికెట్‌లో జోరుమీదున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ ముకుతాడు వేస్తుందో లేక చతికిలపడుతుందో చూడాలి.
ఇక ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్‌సన్ చర్య నవ్వులు పూయిస్తోంది. బౌలింగ్‌కు వచ్చిన రాబిన్‌సన్ తన కాళ్లకు వేర్వేరు షూ వేయడం ఆసక్తి కలిగించింది. సంబంధం లేకుండా ఎడమకాలికి అడిడాస్(Adidas)వేసిన రాబిన్‌సన్.. తన కుడికాలికి రాజోర్(Razor) షూ వేసుకున్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన సందర్భంలో ఓలీ రాబిన్‌సన్ ఇలా మిస్‌మ్యాచ్ షూ వేసుకొచ్చి సీరియస్‌గా సాగిపోతున్న మ్యాచ్‌లో తన చర్యతో అందరిని నవ్వించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఇందులో తప్పేముంది.. బహుశా రెండింటికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుంటాడు.. అందుకే ఇలా వేసుకొచ్చి సమన్యాయం చేశాడు.
281 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 34, నైట్ వాచ్‌మన్ స్కాట్ బొలాండ్ 13 పరుగులతో ఆడుతున్నారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ విజయానికి 174 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఏడు వికెట్లు కావాలి.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 18, 2023
Comments
Please login to add a commentAdd a comment