రాంఛీ వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ సిద్దమవుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి23) నుంచి ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని స్టోక్స్ సేన భావిస్తుంది. ఈ క్రమంలో రాంఛీ టెస్టుకు తమ తుది జట్టును క్రికెట్ ఇంగ్లండ్ ప్రకటించింది. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.
మూడో టెస్టులో దారుణంగా విఫలమైన మార్క్ వుడ్, రెహన్ ఆహ్మద్‌పై మెనెజ్‌మెంట్ వేటు వేసింది. వుడ్ స్ధానంలో స్టార్ పేసర్ ఓలీ రాబిన్సన్, ఆహ్మద్ ప్లేస్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులోకి వచ్చారు. అదే విధంగా వరుసగా విఫలమవుతున్న జానీ బెయిర్ స్టోకు మరో అవకాశమిచ్చారు.
మరోవైపు భారత్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ధానంలో ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే రాంఛీకి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి.
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్‌లీ, ఒల్లీ రాబిన్‌సన్, జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment