యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభావం పొందిన ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో టెస్టులకు 16 మంది సభ్యలుతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అయితే వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు మందు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది.
యాషెస్ సిరీస్‌లో పాల్గొన్న ఎనిమిది మంది ఆటగాళ్లపై సెలెక్షన్ ప్యానల్ వేటు వేసింది. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, హసీబ్ హమీద్ . డేవిడ్ మలన్ సహ మరికొంత మంది ఆటగాళ్లపై వేటు పడింది. అలెక్స్ లీస్,మాథ్యూ ఫిషర్ వంటి యువ ఆటగాళ్లు ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగట్రేం చేయనున్నారు. ఇక ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మార్చి 8న ప్రారంభం కానుంది.
ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జొనాథన్ బెయిర్‌స్టో, జాక్ క్రాలీ, మాథ్యూ ఫిషర్, బెన్ ఫోక్స్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పార్కిన్సన్, ఒల్లీ పోప్, బెన్ స్టీక్ రాబిన్సన్ , క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా!
Comments
Please login to add a commentAdd a comment