
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచలన బంతితో మెరిశాడు. అద్భుతమైన బంతితో భారత బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను ఆండర్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారత ఇన్నింగ్స్ 63 ఓవర్ వేసిన ఆండర్సన్ రెండో బంతిని గిల్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు.
ఆండర్సన్ వేసిన బంతికి గిల్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన గిల్ బిత్తర పోయాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీతో చెలరేగాడు. 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110 పరుగులు చేసింది. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 366 పరుగులు చేసింది.
— Sitaraman (@Sitaraman112971) March 8, 2024
Comments
Please login to add a commentAdd a comment