అండర్సన్‌ మ్యాజిక్‌ డెలివరీ.. బిత్తరపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్‌ | James Andersons Masterful Delivery Claims Rohit Sharmas Wicket | Sakshi
Sakshi News home page

IND vs ENG: అండర్సన్‌ మ్యాజిక్‌ డెలివరీ.. బిత్తరపోయిన రోహిత్ శర్మ! వీడియో వైరల్‌

Published Sun, Feb 4 2024 12:21 PM | Last Updated on Sun, Feb 4 2024 12:28 PM

James Andersons Masterful Delivery Claims Rohit Sharmas Wicket - Sakshi

వైజాగ్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన అండర్సన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సత్తాచాటుతున్నాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. మూడో రోజు ఆట సందర్భంగా అండర్సన్‌ సంచలన బంతితో మెరిశాడు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా జత చేయకుండానే వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్‌ 7 ఓవర్‌ వేసిన అండర్సన్‌.. నాలుగో బంతిని రోహిత్‌కు అద్బుతమైన ఔట్‌ స్వింగర్‌ను సంధించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి రోహిత్‌ బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఈ మ్యాజిక్‌ డెలివరీకి రోహిత్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 27 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి#Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ బాల్‌! బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement