Ind vs Eng 2nd Test Vizag: టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. శుక్రవారం మొదలుకానున్న ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నట్లు వెల్లడించింది.
జాక్ లీచ్ స్థానంలో అతడిని ఎంపిక చేసినట్లు తెలిపింది. అదే విధంగా మార్క్‌వుడ్‌ని తప్పించి.. అతడి స్థానంలో దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను జట్టులోకి తీసుకువచ్చింది మేనేజ్‌మెంట్. ఈ మ్యాచ్‌లో తాము ఈ మేరకు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా తొలి టెస్టులో మార్క్‌వుడ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
మరోవైపు.. హైదరాబాద్ టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన ట్రెయినింగ్ సెషన్‌లో అతడు పాల్గొనలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు బషీర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
విశాఖలో గెలిచేందుకు
కాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జరుగనుంది. ఫిబ్రవరి 2న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు.. మంగళవారమే నగరానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో విశాఖలో విజయం సాధించి 1-1తో సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు దూరం కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల వల్ల విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో చేర్చింది బీసీసీఐ.
టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్! సిరాజ్‌కు నో ప్లేస్?
Comments
Please login to add a commentAdd a comment